Friday 11 March 2011

చిట్టి రాతలు

పుస్తకం నిండా 
జ్ఞాపకాల మేఘాలే
పుస్తకం మూసేస్తే
కళ్ళ నిండా వర్షాలే

రాముడు రావణుడు
ఎవరు అయినా ఒకటే
సీత కళ్ళల్లో కన్నీరే

ఆల్మట్టికి
రెండు వైపులా నీరే
ఓ వైపు కన్నీరు
మరో వైపు పన్నీరు

కాలుతోంది
తెలుగు పూల తోట
తమిళ కర్నాట
కన్నుల పంటగా

1 comment:

  1. నాలుగు పాదాలుండటం నానీల మొదటి లక్షణం
    రాముడు రావణుడు
    ఎవరు అయినా ఒకటే
    సీత కళ్ళల్లో కన్నీరే...... హైకూ ఎఫెక్టు వచ్చింది

    యధాతదంగా బాగున్నాయి మీ చిట్టిరాతలు,లాక్షిణ్యంగా సాధన చేయండి
    అభినందనలు

    ReplyDelete