Thursday 7 July 2011

కోల్ద్ వార్

మిత్రులారా.... భార్యాభర్తల మధ్య అడ్డుగోడల్లా నిల్చే కొన్ని అనవసర సందర్భాలు, ఈగో కారణంగా పెరగడం, ఆనక సద్దు మణిగే విధానం తెలుపుతూ రచయిత శ్రీ కోడూరి విజయకుమార్ గారు రాసిన కోల్ద్ వార్ కవిత అద్భుతం గా ఉంది.. కావాలంటే మీరు ఓ సారి చదివి చూడండి. చదివాక ఆయనకు దూరవాణి ద్వారా అభినందించడం మరవకండి...   

Friday 1 July 2011

బాపు

బక్క పలుచనయ్య
బోసినవ్వు  తాతయ్య
అహింస ఆయుధమయ్య
స్వరాజ్యము తెచ్చెనయ్య

వెలుగు కళ్ళ బాపు
బానిసత్వము బాపు
ప్రుథివి ఉన్నంత సేపు
భారతీయుని ఊపు

జాతినంతను మేలుకొలిపి
తెల్ల జాతిని తరిమికొట్టి
విజయుడై నిలిచినాడు మహాత్మ
విస్మరించదు ఆ భారతీయుని ఆత్మ

మూడు రంగుల జండానందు
ముచ్చటై నిలుచునెందు  
శాంతి దూతగా జాతిపితగా
వెయ్యేళ్ళు అవనిపై వెలుగొందు

Monday 13 June 2011

చిన్నీలు

సూర్యుడు కూడ
చొరలేని
చీకటి
అజ్ఞానం

అద్దం చూపించలేని
అందం
మన మనస్సు

Friday 13 May 2011

వేదిక

ఆదివారం ప్రజాశక్తి దినపత్రిక వేదిక లో నేను ఉత్తరాల రూపంలో రాసే అభిప్రాయాలను ఇక్కడ మీరు చదవవచ్చు

ఉగాది

చిరునవ్వుల సిరిమువ్వలు
వేపపూల సోయగాలు
శుభలేఖల శశిరేఖలు
లేత మావి తోరణాలు
సామవేద సుస్వరాలు
కోయిలమ్మ పాటలు
వేదాలకు భాష్యాలు
పచ్చడిలో ఆరు రుచులు
కలబోసిన సంబరం
విరబూసిన వసంతం
ప్రతి గూటికి ఆనందం  
ప్రతి గుండెకు సంతోషం ...

Saturday 26 March 2011

గురు భోగి

బోధించే గురువులెల్ల భోగిమంటలే
చలి చీకటి తరిమికొట్టు అగ్ని శిఖలే
విజ్ఞానపు వెచ్చదనం పంచే పరమాత్ములే
భొగాలను అంధించే మహాభోజులే

'మహి' మాన్విత మూర్తులు

జన్మనిచ్చిన ఆమ్మకు
పురుడు పోసిన నరుసమ్మకు
కాపిన ముసలమ్మకు
ఎత్తుకొని బుజ్జగించిన ఆయమ్మకు
బాలసారె చేసిన అమ్మమ్మకు
తొలి అన్నం ముద్ద పెట్టిన నాయనమ్మకు
జీవితాన్ని దిద్దిన గురువమ్మకు
తొలి గిలిగింతలు పెట్టిన గృహిణమ్మకు 
ఇలా బతుకు పొడవునా ఎదురైన
ఎందరో మహికే పుట్టిన
మహిమాన్విత మూర్తులు మహిళలు
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ...